గన్నవరం ఫిబ్రవరి23(మనం న్యూస్) :గన్నవరం మండలంలోని కొత్తగూడెం, మెట్లపల్లి గ్రామాల్లో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావుకు ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంటింటికి వెళ్లి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల కరపత్రాలను అందజేసి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ...రాష్టంలో కులమత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపారని చెప్పారు. అనంతరం వచ్చినా ప్రభుత్వాలు ఈ పథకాలను నీరుగార్చుతూ పేదలకు తీరని అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. వైఎస్ జగన్ అధికారంలోకి రావడం ద్వారా నవరత్నాల పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు భరోసాగా నిలుస్తారని పేర్కొన్నారు. రాష్టానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించడంలో టిడిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ప్రత్యేక ప్యాకేజీలు, స్వార్ధ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టిన టీడీపీకి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్సులు కోటగిరి వరప్రసాదరావు, కాసరనేని గోపాలరావు, మండల అధ్యక్షురాలు తుల్లిమిల్లి ఝాన్సీలక్ష్మి, పట్టణ అధ్యక్షులు మద్దినేని వెంకటేశ్వరరావు, గ్రామ అధ్యక్షులు వేమూరి కృష్ణారావు, ఎంపిటిసి అంగడల జయమ్మ, పార్టీ నాయకులు కోడెబోయిన బాబీ, కొలుసు రాఘవులు, బడుగు ఝాన్సీరాణి, శంకర్ తదితరులు పాల్గునారు.
app-mynotepad.com

Share note